పలమనేరు - Palamaner

పలమనేరులో శ్రీ వెంకటేశ్వర మోటార్స్ యూనిట్ ప్రారంభం

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ సమీపంలోని ఆటోనగర్–ఎంఎస్ఎంఈ పారిశ్రామిక ప్రాంతంలో గురువారం,  నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర మోటార్స్ యూనిట్‌ను ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ప్రారంభించారు. ఈ యూనిట్‌ను స్థానిక వ్యాపారవేత్త లోకనాథ రెడ్డి నెలకొల్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికంగా పరిశ్రమల స్థాపన వల్ల ఆర్థిక పురోగతితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రవీంద్ర బాబు, టీడీపీ నేతలు, పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు.

వీడియోలు


జగిత్యాల జిల్లా
దుర్గామాత శోభాయాత్రలో యువతిపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్టు
Oct 22, 2026, 17:10 IST/

దుర్గామాత శోభాయాత్రలో యువతిపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్టు

Oct 22, 2026, 17:10 IST
TG: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి దుర్గామాత శోభాయాత్ర జరుగుతున్న సమయంలో దారుణం చోటుచేసుకుంది. శోభాయాత్రను చూసేందుకు వచ్చిన 19 ఏళ్ల యువతిని.. అదే కాలనీకి చెందిన సంతోశ్ (23) అనే యువకుడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తన తల్లికి జరిగిన విషయాన్ని తెలపడంతో, వెంటనే పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరిపి, గురువారం రిమాండ్‌కు తరలించారు.