
తవణంపల్లిలో భారీ వర్షం.. జలమయమైన రహదారులు
తవణంపల్లి మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని పలు రహదారులు వర్షపు నీటితో జలమయంగా మారాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా రహదారులపై రాకపోకలు సాగించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు సూచించారు. వేగంగా వాహనాలు నడపకుండా, రోడ్ల పరిస్థితిని గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని ఆయన తెలిపారు.




























