క్లోరిన్‌ గ్యాస్‌ లీక్‌.. ఉలిక్కిపడిన స్థానికులు!

25చూసినవారు
క్లోరిన్‌ గ్యాస్‌ లీక్‌.. ఉలిక్కిపడిన స్థానికులు!
AP: ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లిలో మంగళవారం గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపింది. పైలెట్ ప్రాజెక్టు వద్ద గల 500 లీటర్ల సామర్థ్యం గల క్లోరినేషన్ గ్యాస్ ట్యాంకు నుంచి లీకేజీ మొదలవ్వడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. ఘాటైన వాసనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో చేరుకుని ముందుస్తు జాగ్రత్తలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్