AP: ప్రకాశం జిల్లా, రాప్తాడు టంగుటూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు బెంగళూరు నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.