AP: పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన సత్యనారాయణ (90)కు ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. హామీ ఇచ్చినట్లుగానే కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఈ మేరకు సత్యనారాయణ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ‘సీఎం చంద్రబాబు వల్లే నా సొంతింటి కల నెరవేరింది. డిసెంబర్ 3న జరిగే గృహప్రవేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి
లోకేశ్ వచ్చి మా ఇంట్లో అడుగు పెట్టాలి’ అని ఆహ్వానించారు.