దిల్లీ పర్యటనలో ఉన్న CM చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి అందాల్సిన ఆర్థిక సాయం, రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు ప్రతిపాదనలను వేగవంతం చేయాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. అలాగే అర్నబ్, మరుసు తుఫాన్ల వల్ల జరిగిన నష్టం, ఎల్‌నినో పరిస్థితుల కారణంగా ఎదురైన సమస్యలను వివరించి, రాష్ట్రానికి తగిన ఆర్థిక సహకారం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనుల వేగవంతానికి కేంద్రం మద్దతును ఆయన కోరారు.