AP: అక్వాన్ తుఫాన్ పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ గమనం, తీవ్రత గురించి అధికారులతో సమీక్షించారు. ఈ సాయంత్రానికి తుఫాన్ పై పూర్తి స్పష్టత వస్తుందని ఆర్టీజీఎస్ అధికారులు వెల్లడించారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదని, తుఫాన్ వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు వాతావరణ హెచ్చరికలు పంపి, ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు.