AP: విజయనగరం మేయర్ స్థానానికి సంబంధించి టీడీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మేయర్ సీటు ఆశించి టిడిపిలో చేరిన చిన్న శ్రీనుకు పార్టీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఈ స్థానాన్ని అవనపు భార్గవికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు తన పట్టు నిరూపించుకుంటూ, తన పంతాన్ని నెగ్గించుకున్నారు. పార్టీ అంతర్గత సమీకరణాల్లో భాగంగా ఈ కీలక మార్పు చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.