భారత మహిళల కబడ్డీ జట్టుకు సీఎం అభినందనలు

21చూసినవారు
భారత మహిళల కబడ్డీ జట్టుకు సీఎం అభినందనలు
AP: భారత మహిళల కబడ్డీ జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించడంపై సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఫైనన్‌లో ఇరాన్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించి టైటిల్‌ను నిలబెట్టుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. మైదానంలో క్రీడాకారిణులు ప్రదర్శించిన ధైర్యం, సమష్టి కృషి, పదునైన ఆటతీరు ప్రపంచస్థాయి ప్రమాణాలకు నిదర్శనమన్నారు. ఈ విజయంతో దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచారని చంద్రబాబు కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్