తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు 'తాయ్మామన్ తంగ మొతిరమ్ థిట్టమ్' పథకాన్ని మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి విజయ్ నవజాత శిశువులను ఎత్తుకొని వారికి బంగారు ఉంగరాలను అందించారు.