AP: రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సమరంలో అధికార ఎన్డీయే కూటమి (
టీడీపీ-
జనసేన-
బీజేపీ) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రేపు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో, కూటమి ముఖ్య నేతలు సీట్ల సర్దుబాటుపై ప్రత్యేక దృష్టి సారించారు. విశాఖపట్నం, ఏలూరు వంటి ప్రధాన కార్పొరేషన్లలో పార్టీల మధ్య నెలకొన్న గందరగోళాన్ని నివారించేందుకు, అదనంగా దాఖలైన నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు కూటమి అధిష్ఠానం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మేయర్, చైర్మన్ పీఠాలపై పట్టు సాధించే లక్ష్యంతో ఈ సమన్వయ ప్రక్రియను వేగవంతం చేశారు.