AP: పెందుర్తిలో
టీడీపీ,
జనసేన కూటమి నేతల మధ్య తీవ్ర విభేదాలు బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే రమేష్ బాబు సమక్షంలోనే రోడ్డుపైనే ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకుంటూ, కొట్టుకున్నారు. ఈ సంఘటనతో కూటమి నేతలపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకుల మధ్య నెలకొన్న ఈ ఘర్షణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.