జంతువుల దత్తతకు ముందుకు రండి: పవన్ కళ్యాణ్

10889చూసినవారు
జంతువుల దత్తతకు ముందుకు రండి: పవన్ కళ్యాణ్
AP: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పిలుపునిచ్చారు. జూలలోని జంతువులను దత్తత తీసుకోవాలని పౌరులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలను కోరారు. జీవవైవిధ్య పరిరక్షణకు మద్దతుగా ఈ చర్య చేపట్టాలని ఆయన సూచించారు. ఆయన ఆదేశాల మేరకు తిరుపతి, విశాఖపట్నం జూలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. జంతువుల ఆవాసాలు, సందర్శకుల మార్గాలు, పచ్చదనం, వ్యర్థాల నిర్వహణ వంటి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్