AP: రాష్ట్రంలో జరిగిన 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ కోసం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. మొత్తం 6,831 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయగా, సుమారు 47,817 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత సాధారణ ఓట్లను లెక్కించనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.