ఏపీలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌

0చూసినవారు
ఏపీలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌
AP: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 3,803 సర్పంచ్, 29,603 వార్డు మెంబర్ స్థానాలకు 74.85 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. తాజా ఫలితాల సరళిని బట్టి, సుమారు 1,210 స్థానాలకు పైగా కూటమి మద్దతుదారులు ఆధిక్యంలో కొనసాగుతుండగా, వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులు 134 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్