బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్‌ తుఫాన్‌

15చూసినవారు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్‌ తుఫాన్‌
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్‌ తుఫాన్ నేడు సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం గంటకు 3 కి.మీ. వేగంతో కదులుతున్న ఈ తుఫాన్ చెన్నైకి 610 కి.మీ., మచిలీపట్నానికి 660 కి.మీ., విశాఖపట్నానికి 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున, తీర ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్