AP: బంగాళాఖాతంలో వాతావరణ అనిశ్చితి కారణంగా అక్వాన్ తుఫాన్ తన దిశను మార్చుకుంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఇది శ్రీకాకుళం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నప్పటికీ, తీరానికి చేరుకునే సమయానికి క్రమంగా బలహీనపడుతుందని నిపుణులు స్పష్టం చేశారు. ఏపీకి తుఫాన్ ముప్పు దాదాపు తప్పినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ, శ్రీకాకుళం సహా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు.