సగం ఏపీపై అక్వాన్ తుఫాన్ ముప్పు..!

77చూసినవారు
సగం ఏపీపై అక్వాన్ తుఫాన్ ముప్పు..!
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, నేడు అక్వాన్ తుఫాన్‌గా బలపడనుంది. ఇది ఈనెల 20న నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. తీరం దాటే సమయంలో 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముందని హెచ్చరించింది. మచిలీపట్నం కేంద్రంగా ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనా. ఈ తుఫాన్ నేపథ్యంలో గురువారం, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్