ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 36 ప్రాంతాల్లోని 143 చోట్ల అత్యంత భారీ వర్షాలు, 205 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. కన్నూరుపాలెంలో అత్యధికంగా 26.1 సెం.మీ., భోగాపురం, ముడసర్లోవలో 25.9 సెం.మీ. వర్షపాతం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.