AP: అల్లూరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి మేఘాల కొండకు వెళ్లే ప్రధాన రహదారిపై అర్నాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. తుఫాన్ ధాటికి కొండచరియలు విరిగిపడటంతో భారీ బండరాళ్లు రోడ్డుకు అడ్డంగా పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్డు ధ్వంసమవ్వడంతో పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.