తీరానికి దగ్గరలో అర్నబ్ తుఫాన్

129చూసినవారు
తీరానికి దగ్గరలో అర్నబ్ తుఫాన్
ఏపీ తీరానికి దగ్గరలో అర్నబ్ తుఫాన్ ఉందని, ఈ 12 గంటలు అత్యంత అప్రమత్తత అవసరమని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ అన్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో బుధవారం ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. గంటకు 100-140 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. పూరిళ్లు, రేకుల షెడ్లలో నివసించే వారు దగ్గరలోని పునరావాస కేంద్రాలకు వెంటనే వెళ్ళాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ 1070, 112, 18004250101 నంబర్లకు సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్