AP: అంతర్వేది వద్ద తుఫాను తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ తుఫాను పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు దిగువన ఉన్న కాళీపట్నం సమీపంలో సముద్ర తీరం వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో రాబోయే 24 గంటల పాటు అతి భారీ వర్షాలు, తదుపరి 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విశాఖపట్నంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తుండగా, ఈదురు గాలుల తీవ్రత కాస్త తగ్గినట్లు సమాచారం.