తుఫాన్ ఎఫెక్ట్‌.. ఏపీ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

0చూసినవారు
తుఫాన్ ఎఫెక్ట్‌.. ఏపీ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 27న కాకినాడ, కోనసీమ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చారు. కడప, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే 28వ తేదీన కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్