AP: మురసు తుఫాన్ నష్టంపై సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం వర్చువల్ భేటీ నిర్వహించింది. తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం సీఎంతో చర్చించింది. బృందం పరిశీలించిన అంశాలను సీఎం చంద్రబాబుకు వెల్లడించింది. మురసు తుఫాన్ వల్ల రూ.2,484 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం కేంద్ర బృందానికి వెల్లడించింది.