AP: మురసు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. సోమవారం కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఒకటి, రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏలూరు, ఉ.గోదావరి,
ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.