కర్నూలు మేయర్ బరిలో అత్తాకోడళ్లు!

38చూసినవారు
కర్నూలు మేయర్ బరిలో అత్తాకోడళ్లు!
AP: కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆసక్తికరమైన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ మేయర్ అభ్యర్థిగా విజయ ప్రత్యూష, వైసీపీ అభ్యర్థిగా సుశీల పోటీ చేస్తున్నారు. వీరు వరుసకు అత్తాకోడళ్లు కావడం గమనార్హం. విజయ ప్రత్యూష సోదరి ప్రియాంక, సుశీల కుమారుడిని వివాహం చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడింది. రెండు ప్రధాన పార్టీల తరఫున వీరు బరిలో ఉండటంతో, రాజకీయ వర్గాల్లో మరియు ప్రజల్లో ఈ అత్తాకోడళ్ల పోటీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్