AP: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చివేశారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అతిపురాతన ఆలయాన్ని కూటమి ప్రభుత్వం కూల్చివేసిందని
వైసీపీ ఆరోపించింది. కడప-రేణిగుంట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అధికారులు ఆలయాన్ని కూల్చివేస్తుండగా.. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అడ్డుకున్నారని తెలిపింది.