AP: విజయనగరంలో పౌర సరఫరాల శాఖకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ కె.రామారావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రేషన్ డీలర్‌షిప్ పునరుద్ధరణకు సంబంధించి లంచం తీసుకుంటున్న సమయంలో ఆయన పట్టుబడ్డారు. కె.రామారావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.