AP:
ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం, కనుమూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి కదలికలను అధికారులు మళ్లీ గుర్తించారు. మూడు రోజుల విరామం తర్వాత ట్రాకర్ నుండి సంకేతాలు అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఏడో రోజుకు చేరుకున్న 'టైగర్ ఎక్స్ప్లోరర్' ఆపరేషన్ కొనసాగుతోంది. పులి సంచారంపై స్థానికులు భయాందోళనలకు గురికాకుండా అటవీ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.