AP: కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం నాలుగో శుక్రవారం కావడంతో ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతాల్లో పాల్గొన్న మహిళల కోసం డిప్యూటీ సీఎం పవన్ పట్టుచీరలు కానుకగా పంపించారు. మొత్తం 12 వేల మంది మహిళలకు ఐదు విడతలుగా ఈ చీరలను పంపిణీ చేయనున్నారు.