
ఉద్యోగ ఆఫర్లు రద్దు చేసిన 22 కంపెనీలపై ఐఐటీల వేటు
దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో భాగంగా విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్లు ఇచ్చి, ఆపై వాటిని ఉపసంహరించుకున్న 22 కంపెనీలపై రాబోయే రెండేళ్లపాటు రిక్రూట్మెంట్కు ఆంక్షలు విధించనున్నాయి. 2026 గ్రాడ్యుయేషన్ బ్యాచ్కి సంబంధించి 150కి పైగా ఆఫర్లను రద్దు చేసిన నేపథ్యంలో 'ఆల్ ఐఐటీస్ ప్లేస్మెంట్ కమిటీ' ఈ చర్యకు సిద్ధమైంది. ఒరాకిల్ సహా పలు ప్రముఖ టెక్ సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం.




