AP: గత ఏడాది ఏప్రిల్లో తెనాలిలో కానిస్టేబుల్ చిరంజీవిపై నలుగురు యువకులు హత్యాయత్నం చేశారంటూ పోలీసులు నమోదు చేసిన కేసును జిల్లా కోర్టు కొట్టివేసింది. యువకులు హత్యాయత్నం చేశారనడానికి తగిన ఆధారాలు లేవని, పోలీసులు బనాయించింది తప్పుడు కేసని కోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న యువకులను విచారణ పేరుతో నడిరోడ్డుపై లాఠీలతో కొట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.