వరద నీటిలో చిక్కుకున్న డ్రైవర్లు సురక్షితం

6చూసినవారు
వరద నీటిలో చిక్కుకున్న డ్రైవర్లు సురక్షితం
AP: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పాత టోల్‌ప్లాజా వద్ద వరద నీటిలో చిక్కుకున్న ఇద్దరు లారీ డ్రైవర్లను రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్) బృందాలు రక్షించాయి. వరద ఉధృతి పెరగడంతో లారీతో సహా డ్రైవర్లు నీటిలో చిక్కుకుపోయారు. ఈ విషయం తెలిసి వెంటనే స్పందించిన సహాయక బృందాలు వరదలో చిక్కుకున్న వారిని రక్షించి.. సురక్షిత ప్రాంతానికి తరలించాయి.

సంబంధిత పోస్ట్