ఏపీలో ద్రోణి ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో శుక్రవారం నెల్లూరు, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంటూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్డీఎంఏ హెచ్చరించింది.