AP: రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను ప్రోత్సహించే లక్ష్యంతో, ముఖ్యంగా మహిళల ఆర్థికాభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలలో భాగంగా, ఉన్నతి పథకం కింద అర్హులైన డ్వాక్రా మహిళలకు వ్యక్తిగతంగా రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. ఈ రుణాలను 24 వాయిదాలలో (ఎస్సీ, ఎస్టీ మహిళలకు 36 వాయిదాలు) వడ్డీ లేకుండా తిరిగి చెల్లించవచ్చు. ఆసక్తిగలవారు డీఆర్‌డీఏ అధికారులను సంప్రదించాలని సూచించారు.