
లడ్డు డ్రా విజేత వివేక్ రెడ్డి
కొంకుదురులో గోపాల రామానాయుడు వీధిలోని శ్రీదేవి అమ్మవారి పీఠంలో ఉంచిన మహిమాన్విత లడ్డూను గ్రామానికి చెందిన కర్రి వివేక్ రెడ్డి మంగళవారం డ్రా లో విజేతగా నిలిచి కైవసం చేసుకున్నారు. తమ కుమారుని జన్మదినం రోజే డ్రాలో లడ్డు దక్కడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వివేక్ రెడ్డి తరఫున లడ్డూను అందుకున్న ఆయన తండ్రి కె. వి. కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. కమిటీ సభ్యులు లడ్డును విజేత కు అందజేశారు.





























