
కొవ్వూరు వైసీపీ మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా అంజలిదేవి
కొవ్వూరు మున్సిపల్ చైర్ పర్సన్అంజలీ దేవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచినట్లు పార్టీ నాయకులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజలీ దేవికి పార్టీ తరఫున మద్దతు ప్రకటించారు.




































