
కాటకోటేశ్వరంలో గుర్తింపు కార్డులు పంపిణి
నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు సారధ్యంలో మండల అధ్యక్షులు అయినీడి పల్లారావు అధ్వర్యంలో ఎన్నికల సమాయత్త మీటింగ్ మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతంపై చర్చించారు. అనంతరం కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డులను మండల అధ్యక్షులు పల్లారావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




























