
ఆర్టీసీ ప్రవేటికరణ వ్యతిరేకంగా నల్లబ్యాడ్జితో నిరసన
రాజమహేంద్రవరం బస్టాండ్ లో ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన తెలిపారు. ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ బాధ్యతలను కూడా ఆర్టీసీ సంస్థే చేపట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని నిరసనకారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఈయూ జోనల్ అధ్యక్షుడు చిరంజీవి గిడ్ల, ఎన్ఎంయూ నాయకుడు వాసు తదితరులు పాల్గొన్నారు.




































