
వైసీపీ నూతన కమిటీలు ఎంపిక
సీతానగరం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకు నూతన కమిటీలను నియమించినట్లు రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర యువ జన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా వెల్లడించారు. పంచాయతీ రాజ్, మేధావులు, డాక్టర్స్ విభాగాలకు సంబంధించి నూతన కార్యవర్గాలను ప్రకటించారు. పంచాయతీరాజ్ విభాగం - మండల అధ్యక్షుడిగా కూనవరం గ్రామానికి చెందిన మండపాక గణేశ్వరరావును నియమించారు. ఉపాధ్యక్షులుగా మట్టా శ్రీను, తాడేపల్లి వెంకటరావు, ప్రధాన కార్యదర్శులుగా తీకిరెడ్డి రామకృష్ణ, వడ్లమూరి రవిశంకర్ వర్మ , మట్టా రాజు, మేకల సూరిబాబులను నియమించారు.























