Sep 09, 2026, 13:09 IST/
దళితులను అవమానిస్తే వదిలిపెట్టం: సీఎం రేవంత్ రెడ్డి (VIDEO)
Sep 09, 2026, 13:09 IST
దళితులను అవమానించే పనులు చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని, బుద్ధిలేని పనులకు పాల్పడిన వారిని, వారి వెనుక ఉన్నవారిని ఎవరినీ వదిలిపెట్టబోమని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. దళిత సోదరులను ఇంతలా అవమానించిన వారిపై, దీని వెనుక కుట్రలు పన్నిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా సరే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని సీఎం తేల్చిచెప్పారు.