
జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా వీ చక్రధరరావు ఎంపిక
అమలాపురం మండలం కామనగరువు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వీ చక్రధరరావు ని జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా ఎంపిక చేశారు. సెప్టెంబర్ 5వ తేదీన జాయింట్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో శుక్రవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా కమిటీ, గ్రామస్తులు ఆయనను అభినందించారు.






































