Oct 05, 2026, 09:10 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి
Oct 05, 2026, 09:10 IST
శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై వెల్దండ మండల కేంద్రం సమీపంలో మహబూబ్ స్వామి దర్గా వద్ద సోమవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని సుమారు 40 ఏళ్ల గుర్తుతెలియని మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.