
కోవిడ్ లో సేవ చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
కాకినాడలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జే.ఏ.సి నిరసనకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సంఘీభావం తెలిపింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్. తోకల వరదరాజ సాంచి మాట్లాడుతూ, "ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రక్తమాంసాలను పిండుకోవడం తప్పు అని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి పర్మినెంట్ చేయాలన్నారు. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం అందరినీ పర్మినెంట్ చేసిందని తెలిపారు. జిల్లా కన్వీనర్ నరాల శివ మాట్లాడుతూ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేశారని అన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్, కోవిడ్ సేవలకు గుర్తింపు, ఉద్యోగ భద్రత ఇవ్వాలని, న్యాయపోరాటంలో ఆప్ అండగా ఉంటుందని తెలిపారు.
































