Oct 02, 2026, 10:10 IST/
తెలంగాణలో సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్సు ప్రయాణం!
Oct 02, 2026, 10:10 IST
తెలంగాణలో మహిళలతో పాటు సీనియర్ సిటిజన్లకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్ పాస్లు జారీ చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని, అర్హతలు, వయోపరిమితి, విధివిధానాలను ఖరారు చేయాల్సి ఉందని చెప్పారు. నిబంధనలు రూపొందించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.