Sep 18, 2026, 07:09 IST/
స్కూల్ మెట్ల పైనుంచి పడి విద్యార్థిని మృతి (VIDEO)
Sep 18, 2026, 07:09 IST
TG: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఓ పాఠశాలలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నాలుగో తరగతి విద్యార్థిని వర్ణిక, పాఠశాల మెట్లపై నుంచి దిగుతూ కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. మెట్లపై నుంచి బాలిక పడిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.