కొత్తపేట - Kothapet

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

అనకాపల్లి జిల్లా జి. మాడుగుల మండలం కాగిత గ్రామానికి చెందిన సోదరులు రబ్బా నవీన్, రబ్బా ప్రసాద్(22) వాడపల్లి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం మురారి బరోడా బ్యాంక్ ఎదురుగా టిప్పర్ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమ్ముడు ప్రసాద్ పై నుంచి టిప్పర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందగా, అన్నయ్య నవీన్ ను టిప్పర్ ఈడ్చుకెళ్లడంతో చేయి నుజ్జునుజ్జయి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన నవీన్ ను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా