మండపేట - Mandapet

కేశవరం: విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్ల పంపిణీ

కేశవరం: విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్ల పంపిణీ

మండపేట మండలం కేశవరం మండల ప్రజా పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు చోడే కృష్ణమూర్తి తన సొంత నిధులతో రూ. 12 వేలు ఖర్చు చేసి నాణ్యమైన స్టీల్ వాటర్ బాటిళ్లను బహూకరించారు. మంగళవారం పాఠశాలలో జరిగిన సమావేశంలో గ్రామ నాయకులు కంటిపూడి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ఈ బాటిళ్లను అందజేశారు. వేసవిలో పిల్లల ఆరోగ్యానికి నీరు ఎంతో అవసరమని గుర్తించి, అడ్మిషన్లు పెరిగిన ఉత్సాహంతో హెచ్ఎం చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని రాంబాబు, ఉపాధ్యాయులు, ఎస్. ఎం. సి సభ్యులు, తల్లిదండ్రులు కొనియాడారు.

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా
ఒక కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులు ఉండవచ్చా?
Sep 08, 2026, 10:09 IST/

ఒక కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులు ఉండవచ్చా?

Sep 08, 2026, 10:09 IST
ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ, సొంత ఆదాయం, ప్రత్యేక వంటగది, ఖర్చులు ఉంటే ప్రత్యేక రేషన్ కార్డు పొందవచ్చని పౌర సరఫరాల శాఖ నిబంధనలు స్పష్టం చేశాయి. వివాహితులు, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వేరే నగరాలకు వెళ్లేవారు, ఒంటరి వ్యక్తులు కూడా కొన్ని షరతులకు లోబడి కొత్త కార్డుకు అర్హులు. తల్లిదండ్రులతో కలిసి నివసించే పెళ్లికాని వారికి ఇది వర్తించదు. కొత్త కార్డు కోసం ప్రస్తుత కార్డు నుండి పేరు తొలగింపు ధృవీకరణ, గుర్తింపు, చిరునామా, ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు ఆహార, పౌర సరఫరాల శాఖ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు తనిఖీ తర్వాత కార్డు జారీ చేస్తారు.