
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
తాళ్లరేవు మండలం కొత్తూరు వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. కొత్తూరు వద్ద ఆటోను బైక్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద స్థలంలో ఇద్దరు యువకులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతులను కృష్ణ, కొండ్రు తంబి, మణికంఠగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

































