
బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం, ప్రసాద కార్యక్రమం
ముక్కొల్లులో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం హనుమాన్ టెంపుల్ సమీపంలో వినాయకుడి ప్రసాదం, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కమిటీ సభ్యులు కోలా అజయ్, మేడిబోయిన చక్రధర్, బందిలా గంగాబాబు, అమలకంటి శివ, జువ్వల సతీష్, వామిశెట్టి దొర, కొట్టిపల్లి సంజయ్, పోతుల శివ, వామిశెట్టి శంకర్ తెలిపారు.





















